IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ వేటను ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్న **రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)**కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. గత ఐదు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ పేసర్, ఇంకా కోలుకోవడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.
Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఆడే.. తొలి రెండు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న హేజిల్‌వుడ్.. ఏప్రిల్ మధ్య నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.జోష్ హేజిల్‌వుడ్ కండరాలతో పాటు.. అకిలీస్ (పాదం మడమ వెనుక భాగంలో) సమస్యతో బాధపడుతున్నాడు.
ఈ సమస్య కారణంగానే యాషెస్‌తో పాటు.. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 ఆడలేకపోయాడు. అయితే అతడు ఐపీఎల్ 2026 ప్రారంభం నాటికి కోలుకుంటాడని ఆర్సీబీ ఫ్యాన్స్ భావించారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో కనీసం తొలి రెండు మ్యాచ్‌లలో.. ఆర్సీబీ అతడి సేవలను కోల్పోనుంది!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: