📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2026: CSK లో చేరడంపై సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 10:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచిన సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) నుండి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు మారడంపై తాజాగా ఆయన స్పందించారు. సుదీర్ఘ కాలం పాటు రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా, వెన్నెముకగా ఉన్న సంజూ.. ఆ జట్టును వీడటం వెనుక గల కారణాలను వివరిస్తూ అభిమానుల ముందుకు వచ్చారు.

Read Also: Cricketer Deepika: అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

“నా సమయం ముగిసిందని అనిపించింది”

తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ రాయల్స్‌ జట్టును వీడటానికి గల కారణాన్ని సంజూ శాంసన్ వెల్లడించాడు. ‘నేను ఆ జట్టులో నా సమయం ముగిసిందని భావించా. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. అయితే నేను ఒక్కసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించి తప్ప ఇంకేమి ఆలోచించను.

రాజస్థాన్‌ టీమ్‌లో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా నాకు తెలుసు. వారు నా పట్ల చాలా ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకుసాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్ రాయల్స్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.సీఎస్‌‌కే‌కు ట్రేడ్ అయిన విషయం తెలియగానే మహీ భాయ్‌తో ఫోన్‌లో మాట్లాడా. అతనితో కలిసి ఒకే జట్టులో ఆడబోతుండడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ధోనీ నుంచి నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం.

IPL 2026: Sanju’s interesting comments on joining CSK

సీఎస్‌కే తరఫున ఆడేందుకు ఆసక్తి ఎదురు చూస్తున్నా. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చెన్నై అభిమానులకు ధన్యవాదాలు.వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యం. ఈ విషయం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పదే పదే చెబుతారు. టీమ్‌లో ప్రతి ఒక్కరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తారు. నేను కూడా మొదటి నుంచి ఇదే నమ్ముతాను. జట్టు విజయం కోసమే కృషి చేయడం ముఖ్యం. కేరళలో వయసు విభాగాల టోర్నీలు ఆడుతున్నప్పటి నుంచి ఇదే ఆలోచనతో నేను బరిలో దిగేవాడిని. జట్టు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాను.’అని సంజూ తెలిపాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chennai Super Kings IPL 2026 Rajasthan Royals Sanju Samson

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.