ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.గతేడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: T20 WC: జింబాబ్వే తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
యువ ఆటగాడికి పగ్గాలు
రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 1566 పరుగులు చేశారు. 2024 సీజన్‌లో 573 పరుగులతో (సగటు 52.09) సత్తా చాటారు. గత సీజన్‌లో కూడా 166.52 స్ట్రైక్ రేట్‌తో 393 పరుగులు చేసి తన దూకుడును నిరూపించుకున్నారు. బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు. రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు సంగక్కర కోచింగ్‌లో,
పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టనుంది.2008లో షేన్ వార్న్ సారథ్యంలో మొదటి టైటిల్ గెలిచిన రాజస్థాన్, ఆ తర్వాత మళ్ళీ కప్ అందుకోలేదు. ఇప్పుడు ఒక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. మరి ఈ 24 ఏళ్ల కుర్ర కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ కిరీటాన్ని తెచ్చిపెడతాడో లేదో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: