Sehwag Comments on SRH vs RCB: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోకి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రాకపై మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి..ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, మైదానంలో ఆట కంటే ముందే బయట మాటల యుద్ధం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే పోరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరికొత్త కోణంలో ఆవిష్కరించారు.
Read Also: Ishan Kishan: SRH కెప్టెన్‌కు అవమానం: ఔట్ చేసి వెళ్ళిపోమంటూ సైగ చేసిన బౌలర్

సెహ్వాగ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం
ఈ మ్యాచ్‌ను సాధారణ ఐపీఎల్ మ్యాచ్‌లా కాకుండా, భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరులా చూడాలని టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరును తప్పుబడుతూ, ఈ ఐపీఎల్ మ్యాచ్‌ను జాతీయవాద కోణంలో చూడాలని ఆయన కోరారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ. 2.34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: