📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2026: పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

Author Icon By Aanusha
Updated: March 12, 2026 • 9:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ గురువారం తమ కొత్త మ్యాచ్ జెర్సీని అత్యంత ఆకర్షణీయంగా ఆవిష్కరించింది. గత ఏడాది (2025) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో తృటిలో టైటిల్ మిస్ చేసుకున్న పంజాబ్, ఈసారి సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

Read Also: Abhishek sharma : ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

సరికొత్త డిజైన్.. ప్రత్యేక రంగులు

ఈ ఏడాది జెర్సీ కోసం పంజాబ్ కింగ్స్ గతంలో కంటే భిన్నమైన శైలిని ఎంచుకుంది.

భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోచ్‌గా ఉన్న ఈ జట్టు, కొత్త జెర్సీ డిజైన్ వెనుక ఉన్న స్ఫూర్తిని కూడా వివరించింది. జెర్సీ మధ్యలో సింహం బొమ్మ ఉంటుందని, అది క్రమంగా వజ్రాల ఆకృతులలోకి మారుతుందని ఫ్రాంచైజీ పేర్కొంది. “సింహం దూకుడు, ప్రతిభకు ప్రతీక అయితే… కఠోర శ్రమ, ఒత్తిడిలో రాటుదేలిన తర్వాత ఆ ప్రతిభ వజ్రంలా మారుతుందనడానికి ఈ డైమండ్స్ నిదర్శనం” అని తెలిపింది.

IPL 2026: Punjab Kings unveil new jersey

మార్చి 31న న్యూ చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగే తొలి మ్యాచ్‌లో పంజాబ్ ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న చెన్నైలో సీఎస్‌కేతో, ఏప్రిల్ 6న కోల్‌కతాలో కేకేఆర్‌తో తలపడనుంది. అనంతరం సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.

ఈ సీజన్ కోసం పంజాబ్ జట్టు ఇప్పటికే ఉదయ్‌పూర్, అబుదాబిలలో శిక్షణా శిబిరాలు నిర్వహించింది. ప్రస్తుతం తమ రెండో హోమ్ గ్రౌండ్ అయిన ధర్మశాలలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ జెర్సీలను విడుదల చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IPL 2026 PBKS New Jersey 2026 Punjab Kings Ricky Ponting shreyas iyer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.