
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కెప్టెన్ రిషబ్ పంత్, అర్జున్ టెండూల్కర్ మధ్య జరిగిన సరదా, స్ఫూర్తిదాయకమైన సంభాషణ హైలైట్‌గా నిలిచింది.
Read Also: IPL 2026: సంజూ CSK ఎంట్రీపై వరల్డ్ కప్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
నీ డెడికేషన్ అద్భుతం భాయ్
ఇటీవల వివాహం చేసుకున్న అర్జున్, పెళ్లైన మరుసటి రోజే తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొనడం చూసి పంత్ ఆశ్చర్యపోయాడు. క్రికెట్ పట్ల అర్జున్‌కు ఉన్న అంకితభావాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఆయన ఎంతగానో మెచ్చుకున్నాడు.ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో పంత్, అర్జున్‌తో మాట్లాడుతూ.. “యువీ పాజీతో కూడా ఫుల్ టైం ప్రాక్టీస్ చేశావా? పెళ్లైన మరుసటి రోజేనా? నీ డెడికేషన్ అద్భుతం భాయ్” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యువ ఆటగాడికి భరోసా ఇస్తూ, “ఏదైనా అవసరం వస్తే నాకు చెప్పు.. నీకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను” అని పంత్ హామీ ఇచ్చాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ‘భారీ’ బ్యాట్
ఇదే వీడియోలో వారిద్దరి మధ్య బ్యాట్ల బరువు గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. తన బ్యాట్ బరువు 1220 గ్రాములు ఉంటుందని, 1200 గ్రాముల కంటే తక్కువ బరువున్న బ్యాట్‌ను తాను వాడనని అర్జున్ తెలిపాడు. “మా నాన్న (సచిన్ టెండూల్కర్) అయితే 1310-1315 గ్రాముల బరువున్న బ్యాట్ ఉపయోగించేవారు” అని వెల్లడించాడు. అంత బరువైన బ్యాట్ వాడటం వల్ల ప్రయోజనం ఏంటని పంత్ అడగ్గా, “జస్ట్ బంతిని టచ్ చేస్తే చాలు, అదే వెళ్లిపోతుంది” అని అర్జున్ సరదాగా సమాధానమిచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: