📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IPL 2026: ఆండ్రీ రస్సెల్‌ను వదులుకున్న కోల్‌కతా

Author Icon By Aanusha
Updated: November 16, 2025 • 7:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 (IPL 2026) మెగా వేలం వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఒక్క నిర్ణయంతో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దశాబ్ద కాలంగా జట్టుకు మూలస్తంభంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను రిటైన్ చేయకుండా వదిలేయడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత మెగా వేలంలో రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్న ఈ విండీస్ వీరుడిని ఇప్పుడు వదులుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Read Also:  Sanju Samson: CSK కెప్టెన్‌గా సంజూ?

ఎన్నో మరపురాని విజయాలు అందించాడు

2014 నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2014, 2024లో కేకేఆర్ టైటిల్ గెలిచిన జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, రస్సెల్ రిటైర్ అయ్యే వరకు కేకేఆర్‌ (KKR) లోనే కొనసాగుతాడని 2020లో ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ మాటను యాజమాన్యం నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రస్సెల్‌తో పాటు, అత్యధిక ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు)ను కూడా కేకేఆర్ వదులుకుంది. వీరితో పాటు క్వింటన్ డికాక్, మొయిన్ అలీ, ఆన్రిచ్ నోకియా, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి కీలక ఆటగాళ్లను కూడా రిలీజ్ చేసింది.

ఈ నిర్ణయాలతో ప్రస్తుతం కేకేఆర్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. జట్టులో 13 ఖాళీలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో వేలంలోకి వెళ్తున్నందున, తక్కువ ధరకు రస్సెల్‌ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకేఆర్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్, 2,593 పరుగులు చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andre Russell IPL 2026 Auction KKR Kolkata Knight Riders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.