ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 (IPL 2026) సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తదుపరి సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
Read also: Bangladesh T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026, భారత్‌కు రాని బంగ్లాదేశ్?
తమ సొంత మైదానమైన జైపూర్‌ను కాదని, కొన్ని హోమ్ మ్యాచ్‌లను పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో నిర్వహించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐఏఎన్ఎస్ తన కథనంలో పేర్కొంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)తో ఫ్రాంచైజీకి ఉన్న విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఐపీఎల్ 2025 సమయంలో ఓ ఆర్‌సీఏ అధికారి ఫ్రాంచైజీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ ఆరోపణలను రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఆర్‌సీఏను తాత్కాలిక కమిటీ నడుపుతుండటం కూడా ఈ మార్పునకు మరో కారణంగా కనిపిస్తోంది.రాజస్థాన్ రాయల్స్ ప్రతినిధులు పుణె స్టేడియాన్ని, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని, బీసీసీఐ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ జట్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: