📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2026: సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 10:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) రణరంగం సిద్ధమవుతున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆరంభ సీజన్ నుండి తమను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న అభిమానుల కోసం ‘ROAR 26’ పేరుతో ఒక భారీ లైవ్ షోను నిర్వహించనున్నట్లు సీఎస్కే యాజమాన్యం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Read Also: ODI World Cup 2027: గంభీర్‌కు నిజమైన పరీక్ష అప్పుడే: గంగూలీ

IPL 2026: CSK fans’ delight: ‘ROAR 26’ mega event in Chepauk

విజిల్ పోడు అంటూ… చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రహ్మరథం పట్టే అభిమానులను అలరించేందుకు ఫ్రాంచైజీ మ్యూజికల్ నైట్ నిర్వహించనుంది. మెగా టోర్నీకి ఆరు రోజుల ముందు అంటే.. మార్చి 22 ఆదివారం నాడు చిదంబరం మైదానంలో ROAR 26 అనే స్పెషల్ జరుపనుంది. ఈ నైట్ షోలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన పాటల హోరుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నారు.

District.in platformలో అందుబాటులో టికెట్లు

ప్రస్తుతం స్క్వాడ్‌లోని ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ సహా ఇతర ఆటగాళ్లు పాల్గొననుండగా. ఓజీ సూపర్ కింగ్స్ టీమ్‌గా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, మాథ్యూ హెడేన్, మురళీ విజయ్, బద్రీనాథ్ తదితరులు ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు. సో.. ఈ ప్రత్యేక కార్యక్రమం టికెట్లను ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టింది. మార్చి 15వ తేదీ నుంచి ఫ్రాంచైజీ అధికారిక వెబ్‌సైట్‌లో.. డిస్ట్రిక్ట్ యాప్‌, District.in platformలో టికెట్లు అందుబాటులో ఉంటాయని సీఎస్కే యాజమాన్యం వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chennai Super Kings Fans Chepauk Stadium Live Show CSK ROAR 26 IPL 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.