IPL 2026: రోహిత్ శర్మపై కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
IPL 2026: రోహిత్ శర్మపై కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

IPL 2026: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2026 సీజన్‌లో కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా, మ్యాచ్ మొత్తం మైదానంలో ఉండబోతున్నారు. గత సీజన్‌లో ఆయనను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వాడటంపై వచ్చిన విమర్శలు, సందేహాలకు హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే తెరదించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడికి.. ఈసారి కూడా రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడిస్తారా? ప్లాన్స్ ఏంటి? అనే ప్రశ్న వచ్చింది. దీనికి బదులిచ్చిన జయవర్దనే.. రోహిత్ శర్మ ఈసారి మైదానంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వెల్లడించాడు.

Read Also: Ambati Rayudu: ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు

గత సీజన్‌లో ఎందుకు అలా చేశారు?

ఫిట్‌నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకునే గత సీజన్‌లో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించామని పేర్కొన్నాడు. అతడి ప్రభావం జట్టుపై ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2026లో రోహిత్ శర్మను ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతామని.. జయవర్దనే స్పష్టం చేశాడు. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్.. సంబురపడుతున్నాడు. తమ అభిమాన ఆటగాడిని ఎక్కువ సేపు చూడొచ్చని.. పేర్కొంటున్నారు.

IPL 2026: Coach Jayawardene's key comments on Rohit Sharma
IPL 2026: Coach Jayawardene’s key comments on Rohit Sharma

ప్రస్తుతం రోహిత్ శర్మ.. టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఫిట్‌గా ఉండాలంటే.. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి ఫిట్‌గా ఉండాలని రోహిత్ భావిస్తున్నాడు. ఈ కారణంతో కూడా ఈసారి హిట్‌మ్యాన్.. ఎక్కువ సేపు మైదానంలో ఉండే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.