📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

IPL 2026: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం?

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రసారాలపై తాత్కాలిక ప్రభుత్వం నిరవధిక నిషేధం విధించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వచ్చే ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఎంతో నమ్మకమైన ఆటగాడని ఎటువంటి కారణం లేకుండా తొలగించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.ఇది కేవలం ఒక క్రీడాకారుడికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, తమ దేశ గౌరవానికి సంబంధించిన విషయమని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది.

Read also: Virat Kohli: రూ.300 కోట్ల డీల్‌ను తిరస్కరించిన విరాట్

అంతర్జాతీయ క్రికెట్ మండలికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఐపీఎల్‌ ప్రమోషన్‌, ప్రసారాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ వివాదం కేవలం ఐపీఎల్ తోనే ఆగడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ఘాటైన లేఖ రాసింది.

IPL 2026: Ban on IPL broadcasts in Bangladesh?

2026 ఫిబ్రవరిలో భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు పాల్గొనే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటగాళ్లకు సేఫ్టీ లేదని, అక్కడి వాతావరణం నిష్పక్షపాతంగా లేదని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఐసీసీ అంగీకరించకపోతే, తాము వరల్డ్ కప్ కోసం భారత్‌కు జట్టును పంపే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ తెగేసి చెప్పింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bangladesh government IPL Broadcast Ban Kolkata Knight Riders latest news Mustafizur Rahman Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.