📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

IPL 2025: ప్లే ఆఫ్స్ రేసులో ఉత్కంఠ భరిత పోటీ

Author Icon By Digital
Updated: April 24, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లతో ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. టోర్నమెంట్ మొదటి దశ పూర్తయిన నేపథ్యంలో, ప్లే ఆఫ్స్ రేసులో ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది. మొత్తం పది జట్లలో కేవలం రెండు జట్లను తప్పించి మిగతా జట్లు టాప్ 4లో స్థానం కోసం పోటీ పడి పడుతున్నాయి. రెండవ దశ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో పాయింట్ల పట్టికలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల స్థితి కాస్త క్లిష్టంగా మారింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాలంటే ఈ రెండు జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌లను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. టోర్నీలో కనీసం 16 పాయింట్లు ఉండాలి అంటే, ఒక్క పరాజయమే ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ భవిష్యత్తు కోసం ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది.ఇక ముంబయి ఇండియన్స్ వరుసగా మూడు విజయాలతో మళ్లీ ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ముంబయి ఖాతాలో 8 పాయింట్లు ఉండగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలిస్తే 16 పాయింట్లకు చేరుకోగలదు. అదే కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే, జట్టుకు ఇప్పటివరకు కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం ఐదు గెలవాలి.

IPL 2025: ప్లే ఆఫ్స్ రేసులో ఉత్కంఠ భరిత పోటీ

IPL 2025లో టాప్ఫోర్ కోసం గట్టి పోటీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. తదుపరి 6 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగలదు. ఇక గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో ఉన్నారు. వీరికి నెట్ రన్‌రేట్ కూడా మంచి స్థాయిలో ఉంది (+1.104), కాబట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం పెద్ద సవాలేమీ కాదు.ఇంతవరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు 8 మ్యాచ్‌లు పూర్తి చేశాయి. గుజరాత్ టైటాన్స్ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, లక్నో జట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్లు వరుసగా ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ స్థానాల్లో ఉండగా, ఈ జట్లకు ప్లే ఆఫ్స్‌కి చేరుకోవాలంటే మిగిలిన ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే.

Read More : IPL 2025 : రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఐపీఎల్‌లో కలకలం

Breaking News in Telugu CSK Google News in Telugu Gujarat Titans IPL Cricket News IPL Playoffs IPL Points Table IPL Telugu Latest News in Telugu MI RCB RR SRH Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.