📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 : భారీ స్కోరు సాధించిన కేకేఆర్

Author Icon By Divya Vani M
Updated: May 4, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాజస్థాన్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చెలరేగింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ 20 ఓవర్లలో 206 పరుగులు . ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించగా,అంగ్‌క్రిష్ రఘువంశీ నిఖార్సైన ఇన్నింగ్స్ ఆడాడు.ఆరంభంలోనే సునీల్ నరైన్ (11) ఔటైనా, రహ్మానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడాడు.అతను 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 1 సిక్స్ తో చక్కగా ఆడాడు. కెప్టెన్ అజింక్యా రహానే (30 పరుగులు) తో కలిసి రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.అయితే మహీశ్ తీక్షణ గుర్బాజ్‌ను ఔట్ చేశాడు.రహానేను రియాన్ పరాగ్ వెనక్కు పంపాడు.తరువాత క్రీజులోకి వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ 44 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లో 5 ఫోర్లు ఉన్నాయి.జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు.ఆండ్రీ రస్సెల్ రెచ్చిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు.

ఇందులో 4 ఫోర్లు, 6 భారీ సిక్సులు ఉన్నాయి. చివర్లో రింకూ సింగ్ కూడా మెరుపులు మెరిపించాడు.అతను 6 బంతుల్లో 19 పరుగులు చేశాడు. 1 ఫోర్, 2 సిక్సులతో అదరగొట్టాడు.రస్సెల్, రింకూ కలిపి చివరి ఓవర్లలో విరుచుకుపడ్డారు.దీంతో కేకేఆర్ 200 మార్క్ దాటింది.భారీ స్కోరు సాధించడంలో వీరి పాత్ర ఎంతో కీలకం.జోఫ్రా ఆర్చర్, తీక్షణ, యుధ్వీర్ సింగ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.కానీ మిగతా బౌలింగ్ విభాగం తడబడింది. ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ అత్యధికంగా 3 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చాడు.అది రాజస్థాన్‌పై ఒత్తిడిని పెంచింది.జోఫ్రా ఆర్చర్ మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతను 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు.రియాన్ పరాగ్ కూడా ఆర్దికంగా బౌలింగ్ చేశాడు. అతని 3 ఓవర్లకు 21 పరుగులే వచ్చాయి.పవర్‌ప్లేలో కేకేఆర్ 56 పరుగులు సాధించింది.అది వాళ్లకు శుభ ప్రారంభాన్ని ఇచ్చింది.ఓపెనర్లు మొదలుకొని ఫినిషర్లు వరకూ అందరూ మెరిశారు. అంగ్‌క్రిష్ నెమ్మదిగా నిర్మాణాత్మకంగా ఆడాడు. రస్సెల్, రింకూ చివర్లో అద్భుతం చేశారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బలాన్ని స్పష్టంగా చూపించింది.

Read Also : IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

Andre Russell Batting Today Angkrish Raghuvanshi IPL 2025 Eden Gardens IPL Match IPL 2025 Live Updates KKR Match Today KKR vs RR 2025 Highlights Kolkata Knight Riders Score Rajasthan Royals Bowling Performance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.