📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: క్రికెట్ మైదానంలో ధోనీ,హార్దిక్ ..వీడియో వైరల్

Author Icon By Sharanya
Updated: March 23, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడగా, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో RCB విజయంతో బోణీ కొట్టింది. అయితే IPL 2025లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో క్రేజీ పోరాటం ఇవాళ జరగనుంది. ఈరోజు డబుల్ హెడర్ ఉండగా, మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాదు (SRH) – రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడనుండగా, రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) – చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒకరినొకరు ఢీకొట్టనున్నారు. ప్రత్యేకంగా MI-CSK మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇది క్రికెట్‌లోని రెండు అతి విజయవంతమైన ఫ్రాంచైజీల మధ్య పోరు.

చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులు ఎప్పటిలాగే యెల్లో ఆర్మీగా స్టేడియాన్ని కిక్కిరిసిపోయేలా నింపేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు, ముంబయి ఇండియన్స్ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య నేతృత్వంలో బరిలోకి దిగనుంది.

హార్దిక్-ధోనీ రీ యూనియన్.. మైదానంలో మధుర క్షణం

ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో కలిసి మధుర క్షణాలు పంచుకున్నారు. ధోనీని చూసిన వెంటనే హార్దిక్ పాండ్య హత్తుకుని, ఆయనతో కొద్దిసేపు సరదాగా మాట్లాడాడు. ఇద్దరూ నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇది మైదానంలో ఉన్న అభిమానులందరికీ సర్‌ప్రైజ్ అయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. థలా-హార్దిక్ కలిసి ఉన్న ఈ మోమెంట్ చూడటమే గిఫ్ట్, ఎంఎస్‌డి ముందు ఎవరైనా అభిమానిగానే మారిపోతారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

#ChennaiSuperKings #CSKvsMI #Dhoni #HardikPandya #IPL2025 #mumbaiindians #Thala #ViralVideo #YellowArmy Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.