📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Telugu News: Indoor:ఆసీస్ మహిళా క్రికెటర్ల పై వేధింపులు నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు

Author Icon By Sushmitha
Updated: October 25, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ మహిళల ప్రపంచ కప్(World Cup) ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెటర్లకు ఇండోర్‌లో(Indoor) లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హోటల్ నుంచి ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా టీమ్ సెక్యూరిటీ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Maharastra Crime: మహిళా డాక్టర్ ఆత్మహత్య పోలీస్, ఎంపీపై ఆరోపణలు

వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం ఇండోర్‌లోని ఖజ్రానా రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు తాము బస చేస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ నుంచి ఓ కేఫ్‌కు వెళుతుండగా, అకీల్ ఖాన్‌ అనే యువకుడు బైక్‌పై వారిని వెంబడించాడు. వారిలో ఒకరిని అసభ్యంగా తాకి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన క్రికెట‌ర్లు వెంటనే తమ బృందానికి ఎస్ఓఎస్ నోటిఫికేషన్ పంపించి, టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్‌కు సమాచారం అందించారు.

కేసు నమోదు, నిందితుడి అరెస్ట్

డానీ సిమన్స్ స్థానిక భద్రతా అధికారులతో సమన్వయం చేసుకుని, గురువారం సాయంత్రం ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమానీ మిశ్రా క్రీడాకారిణులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 74 (మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి నిందితుడి బైక్ నంబర్‌ను గుర్తించగా, దాని ఆధారంగా పోలీసులు నిందితుడు అకీల్ ఖాన్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అకీల్‌పై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఏ నగరంలో జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, ఖజ్రానా రోడ్ ప్రాంతంలో జరిగింది.

నిందితుడిపై ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు?

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 74 (అసభ్యంగా ప్రవర్తించడం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Australian cricketers crime against women Google News in Telugu ICC Women’s World Cup Indore police Latest News in Telugu Radisson Blu Hotel Sexual Harassment Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.