📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘనవిజయం

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 9:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 (Women’s ODI World Cup 2025)కు భారత జట్టు అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 59 పరుగుల తేడాతో డక్‌వర్త్–లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ టోర్నమెంట్‌లో బోణీ కొట్టడమే కాకుండా, భవిష్యత్తు మ్యాచ్‌లకు మానసికంగా పెద్ద బలాన్ని కూడగట్టుకుంది.

India vs West Indies: టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ఓ దశలో భారత్‌ బ్యాటింగ్ (India batting) తీవ్ర కష్టాల్లో పడింది. 124 పరుగులకే ఆరుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్‌ చేరడంతో జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.అయితే టీమిండియా ఆల్‌రౌండర్లు అద్భుత ప్రదర్శన కనబరచి జట్టును కాపాడారు.బ్యాట్‌తో అర్ధసెంచరీ చేసి, బంతితో మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, శ్రీలంక బౌలర్ ఇనోక రణవీర (4/46) దెబ్బకు కుదేలైంది. కేవలం రెండు ఓవర్ల (Two overs) వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పతనం అంచున నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (53), అమన్‌జోత్‌ కౌర్‌ (57) అద్భుతంగా పోరాడారు.

India vs Sri Lanka

శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 99 బంతుల్లో 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆఖర్లో స్నేహ్ రాణా (Sneh Rana) కేవలం 15 బంతుల్లోనే 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీప్తి శర్మ (3/54) బంతితోనూ మాయ చేయగా, స్నేహ్ రాణా (2/32) పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశారు.

శ్రీ చరణి కూడా రెండు వికెట్లతో రాణించడంతో శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. లంక జట్టులో కెప్టెన్ చామరి ఆటపట్టు (43) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్ల క‌ట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు, శ్రీలంక ఫీల్డర్లు పలు క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా టీమిండియా విజయానికి కార‌ణ‌మైంది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News amanjoat kaur Breaking News deepti sharma half century deepti sharma three wickets india vs sri lanka India women cricket team latest news Women’s World Cup 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.