हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: IND vs AUS: భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్

Anusha
Latest News: IND vs AUS: భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్

భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా ప్రస్తుతం ఉత్కంఠగా సాగుతోంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు సమాన బలంతో బరిలోకి దిగగా, రెండో మ్యాచ్‌ భారత్‌కు సవాలుగా మారింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటింగ్ లైనప్ కష్టాల్లో పడింది. ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లు బౌలింగ్‌తో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

Latest News: IND vs AUS: టీ20లో టాస్ గెలిచిన ఆసీస్‌.. భారత్ బ్యాటింగ్

వరుస వికెట్లు కోల్పోతూ పరుగులు తీయడానికి అష్టకష్టాలు పడుతోంది. కనీసం ఒక్క పరుగు తీయడానికి కూడా భారత్‌కు కష్టంగా మారింది. వార్త రాసే సమయానికి భారత్ 8 ఓవర్లలకు గానూ 5 వికెట్లు కోల్పోయి కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా ఉన్నారు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ ‌గిల్ (Shubman Gill) మళ్లీ సెకండ్ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు.

క్రీజ్‌లో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. 2.4వ ఓవర్‌లోనే గిల్ ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ (Michelle Marsh) చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అప్పటికి భారత్ 20 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత వచ్చిన సంజు సామ్‌సన్ (Sanju Samson) కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 

అభిషేక్ మాత్రం మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టాడు

నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో 3.3వ ఓవర్‌లో ఎల్బీతో సంజు (2) వెనుదిరిగాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడు అయినా వికెట్ పడకుండా పరుగులు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతికి 4.3వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన సూర్య ఔటయ్యాడు. అతడు కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. ఇలా స్వల్ప వ్యవధిలోనే టీమ్‌ఇండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ సైతం చేతులెత్తేశాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో 4.5వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి డకౌటయ్యాడు.

దీంతో 5 ఓవర్లకు గానూ భారత్ 4 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ఇంత మంది వరుసగా క్యూ కడుతున్నా.. అభిషేక్ మాత్రం మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చింన అక్షర్ పటేల్ (5) సైతం ఔటై వెనుదిరిగాడు. మొత్తంగా భారత్ 8 ఓవర్లకు 50 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో అభిషేక్, హర్షిత్ ఉన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870