Indian Women Cricket: భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. అయితే ఈ విజయాన్ని భారత్ మాత్రమే కాకుండా పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం కూడా ఘనంగా జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కుటుంబం సభ్యులు పాకిస్థాన్ (pakistan) జెర్సీలు ధరించి, భారత జట్టు ఫొటో ఉన్న కేక్ కట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “టీమిండియాకు అభినందనలు… పాకిస్థాన్ నుంచి ప్రేమతో మద్దతు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
Read also: Washington Sundar: ఐపీఎల్ 2026లో గుజరాత్ తరఫునే సుందర్
Indian Women Cricket
Indian Women Cricket: మరో వీడియోలో చిన్నారులు టీవీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫొటోకు కేక్ తినిపిస్తూ చూపిన సన్నివేశం నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వీడియోలపై భారత అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తూ పాకిస్థాన్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక క్రీడా రంగంలో, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జట్టుకు రూ.39 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, బీసీసీఐ అదనంగా రూ.51 కోట్ల బహుమతి ప్రకటించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: