ఇంగ్లండ్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) కు స్వల్ప విరామం లభించింది. అయితే, ఆటగాళ్లకు త్వరలోనే మళ్లీ బిజీ షెడ్యూల్ మొదలు కానుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ (T20 World Cup) వరకు భారత జట్టు ఆటగాళ్లు నిరంతరం క్రికెట్ ఆడనున్నారు.
రాబోయే మ్యాచ్‌లు
బంగ్లాదేశ్ (Bangladesh) పర్యటన వాయిదా పడటంతో ఆగస్టులో భారత జట్టు (Indian Cricket Team) కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. కానీ, సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగే 2025 ఆసియా కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనుంది. ఈ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
టెస్ట్ మరియు వన్డే క్రికెట్ షెడ్యూల్
టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో రెండు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల మధ్య, ఆస్ట్రేలియాలో వన్డే, T20 సిరీస్‌లలో పాల్గొంటుంది. వైట్ బాల్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది.
2026 T20 వరల్డ్ కప్ వరకు షెడ్యూల్
| ఈవెంట్ | తేదీ | మ్యాచ్‌లు | ఆతిథ్య దేశం |
| ఆసియా కప్ | సెప్టెంబర్ 9-28 | 3-7 టీ20ఐలు | యూఏఐ |
| ఇండియా-వెస్టిండీస్ | అక్టోబర్ 2-14 | 2 టెస్ట్‌లు | భారతదేశం |
| ఇండియా-ఆస్ట్రేలియా | అక్టోబర్ 19-నవంబర్ 8 | 3 వన్డేలు/ 5టీ20లు | ఆస్ట్రేలియా |
| ఇండియా-దక్షిణాఫ్రికా | నవంబర్ 14-డిసెంబర్19 | 2 టెస్టులు/ 3 వన్డేలు/ 5 టీ20లు | భారతదేశం |
| ఇండియా-న్యూజిలాండ్ | జనవరి 11-31 | 3 వన్డేలు/5 టీ20లు | భారతదేశం |
| టీ20 ప్రపంచకప్ 2026 | ఫిబ్రవరి-మార్చి | 4-9 టీ20లు | ఇండియా/శ్రీలంక |
2026 T20 ప్రపంచకప్‌కు సన్నాహాలు
రాబోయే రోజుల్లో భారత జట్టు మొత్తం దృష్టి 2026 T20 ప్రపంచకప్ పైనే ఉండనుంది. ఈ టోర్నమెంట్ వరకు, భారత జట్టు దాదాపు 22-31 T20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ప్రపంచ కప్‌కు ముందు 18-22 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు 4 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే, జనవరి చివరి వరకు షెడ్యూల్ చేసిన 9 వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: