📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Men’s T20 World Cup: విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

Author Icon By Vanipushpa
Updated: March 9, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా జూలు విదిల్చింది. అహమ్మదాబాద్ వేదికగా Narendra Modi Stadiumలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఊచకోత కోసింది. తొలుత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడితే తరువాత బౌలర్లు నిప్పులు చేరిగా బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించారు. ICC Men’s T20 World Cup 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచారు. మరి విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత.. ఇండియా టీం ఎంత బహుమతి గెలుచుకుందో ఓ సారి చూద్దామా.. ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 27.48 కోట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14.65 కోట్లు) బహుమతిగా అందాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ పూల్ సుమారు 13.5 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 120 కోట్లకు పైగా ఉంది. టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించింది.

Read Also: India T20 World Cup Victory: మూడోసారి టీ20 ఛాంపియన్‌గా భారత్

Men’s T20 World Cup: India as the world champion.. What a sight to behold..

అర్హత సాధించలేకపోయిన జట్లు కూడా భారీమొత్తం

సెమీ ఫైనల్స్ వరకు చేరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లు కూడా భారీ మొత్తాన్ని అందుకున్నాయి. ఈ దశలో ఓడిపోయిన South Africa national cricket team, England national cricket team ఒక్కొక్కటి 790,000 డాలర్లు (దాదాపు రూ.7.24 కోట్లు) పొందాయి. అలాగే సూపర్-8 దశకు చేరుకున్న కానీ సెమీ ఫైనల్స్‌కు వెళ్లలేని జట్లు ఒక్కొక్కటి 380,000 (సుమారు 3.48 కోట్లు) సంపాదించాయి. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు కూడా 250,000 డాలర్లు (దాదాపు రూ. 2.29 కోట్లు) అందుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. స్టార్ బ్యాటర్ Sanju Samson అద్భుతంగా ఆడి కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

BCCI Rewards Gemini said Congratulations to Team India! Winning a world title is always a massive moment for the country ICC World Cup Winners Indian Cricket Team Latest News in Telugu Prize Money for Team India Team India Victory Telugu News Paper Telugu News Today World Champion Celebrations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.