India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన సూపర్-8 దశలో భాగంగా గురువారం భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం ఈ కీలక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఇరు జట్లకు ఈ పోరు చావోరేవో వంటిది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడం అత్యవసరం.
Read Also: T20 WC SL vs NZ: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం
జింబాబ్వే కూడా భారత్‌కు షాక్ ఇచ్చి రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఇటీవల సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం భారత్ సెమీస్ ఆశలకు భారీ దెబ్బకొట్టింది. ఆ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రేట్ తీవ్రంగా పడిపోయింది. దీంతో ఇప్పుడు సెమీస్ బరిలో నిలవాలంటే కేవలం గెలుపు సరిపోదు.. భారీ విజయం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది.
చెన్నై పిచ్‌పై ‘డ్యూ ఫ్యాక్టర్’ ప్రభావం
ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించడంలో చెన్నైలోని వాతావరణం, ముఖ్యంగా రాత్రిపూట కురిసే మంచు (Dew) కీలక పాత్ర పోషించనుంది. మైదానంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటే, బంతిపై పట్టు చిక్కక బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాటర్లకు బంతిని బాదడం సులభతరమవుతుంది. ఈ ‘డ్యూ ఫ్యాక్టర్’ కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.మంచు కురిస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి, బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే అవకాశం దక్కుతుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ను ఎంచుకోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా సెమీస్ ఆశలు నిలవాలంటే భారత్ గెలవాల్సిందే.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: