📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: India vs West Indies: టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

Author Icon By Anusha
Updated: September 30, 2025 • 7:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025లో ఘన విజయాన్ని సాధించిన టీమిండియా, ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. కేవలం నాలుగు రోజుల విరామం తర్వాతే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడబోతున్న భారత జట్టు, స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ (Test series) ను ఆడనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 (World Test Championship 2027) లో భాగంగా నిర్వహించబడుతోంది. అక్టోబర్ 2న దసరా పండుగ రోజున అహ్మదాబాద్‌లో తొలి టెస్ట్ ప్రారంభం.

IND VS SL : శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది, రేణుకాకు భారత్ జట్టులో స్థానం

ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ (Selection Committee) ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాష్ దీప్, రిషభ్ పంత్‌లపై వేటు పడింది.గాయాల కారణంగా రిషభ్ పంత్, ఆకాస్ దీప్ ఈ సిరీస్‌లకు దూరంగా కాగా.. పేలవ ప్రదర్శనతో కరుణ్ నాయర్,

అభిమన్యు ఈశ్వరన్ చోటు కోల్పోయారు. భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, బ్యాకప్ వికెట్ కీపర్గా నారయణ్ జగదీషన్ ఈ టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.

మరోవైపు రోస్టన్ చేజ్ సారథ్యంలోని వెస్టిండీస్

మరోవైపు రోస్టన్ చేజ్ సారథ్యంలోని వెస్టిండీస్ (West Indies).. ఇప్పటికే భారత్‌కు చేరి సన్నాహకాలు మొదలు పెట్టింది. భారత టెస్ట్ టీమ్‌లోని మెజార్టీ ఆటగాళ్లు.. భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడారు.

ఈ సిరీస్‌లో భారత్‌కు వెస్టిండీస్ ఏ మాత్రం పోటీ కాదు. కానీ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం

ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. వెస్టిండీస్ 30 విజయాలతో పైచేయి సాధించింది. భారత్ 23 మ్యాచ్‌లు గెలవగా.. మరో 47 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

India vs West Indies

అయితే ఇటీవల వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మరోవైపు భారత్.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్‌స్టార్ (Jio Hotstar) అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియో కస్టమర్లు మాత్రం సంబంధిత రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు.భారత్ :శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్-కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.వెస్టిండీస్ :రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్, కెవ్లోన్ ఆండర్సన్, అలిక్ అథానాజ్, జాన్ క్యాంప్‌బెల్, టేగ్‌నరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

ahmedabad test match asia cup 2025 champions Breaking News India Cricket News India Test Squad india vs west indies test series latest news Team India Telugu News WTC 2027

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.