Ind vs Pak T20 : సెమీస్‌లో భారత్-పాక్ అయితే ముంబై మ్యాచ్ రద్దా?

Read Time:  1 min
Ind vs Pak T20
Ind vs Pak T20
FONT SIZE
GET APP

Ind vs Pak T20 : 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర నిబంధన వెలుగులోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా సెమీఫైనల్‌కు చేరితే మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థిగా పాకిస్థాన్ నిలిస్తే మాత్రం మ్యాచ్ వేదిక మారనుంది.

భారత్–పాక్ సెమీఫైనల్ జరిగే పరిస్థితి వస్తే, ఆ మ్యాచ్‌ను ముంబై నుంచి శ్రీలంకలోని కొలంబోకు తరలిస్తారు. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న “హైబ్రిడ్ మోడల్” ఒప్పందం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్–పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఆసియా కప్ సమయంలో కూడా ఇదే విధానం అమallowలో ఉంది.

Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్‌ చూసారా?

Ind vs Pak T20
Ind vs Pak T20

సెమీఫైనల్‌లో భారత్–పాక్ తలపడితే మ్యాచ్ మార్చి 4న జరగనుంది. అదే రోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరగనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఒకవేళ పాకిస్థాన్ కాకుండా ఇతర జట్టుతో భారత్ సెమీస్ ఆడితే, మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే మార్చి 5న ముంబైలో జరుగుతుంది.

అలాగే పాకిస్థాన్ పాల్గొనే మరో సెమీఫైనల్ కూడా కోల్‌కతా నుంచి కొలంబోకు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.