Ind vs pak match : టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ హై వోల్టేజ్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో బాధపడిన అభిషేక్ శర్మ ఢిల్లీలో చికిత్స పొందాడు. దీంతో నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆడిన సంజూ శాంసన్ వేగంగా పరుగులు సాధించి రాణించాడు. ప్రస్తుతం అభిషేక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మళ్లీ జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
భారత్–పాక్ మ్యాచ్ గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ, “ఈ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒత్తిడి సహజం కానీ మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం” అని అన్నారు. వర్షం ముప్పుపై స్పందిస్తూ, వాతావరణం మన చేతుల్లో లేదని, పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు జట్టు సిద్ధంగా ఉందని తెలిపారు.
పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ సవాల్‌పై సూర్య ధైర్యంగా స్పందిస్తూ, “ఎలాంటి బౌలర్ అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధమే. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు జట్టు ఉత్సాహంగా ఉంది” అని చెప్పారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్–పాకిస్థాన్ జట్లు ఎనిమిది సార్లు తలపడగా, భారత్ ఏడు విజయాలతో ఆధిక్యంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: