India vs Namibia T20 World : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది.
Read Also: T20 World Cup: నేపాల్‌పై ఇటలీ ఘనవిజయం
ఇషాన్, హార్దిక్ విధ్వంసం
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (61) మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేశారు. అనంతరం మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్య (52) తనదైన శైలిలో విరుచుకుపడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో భారత్ 200 పరుగుల మైలురాయిని సులువుగా అధిగమించింది.
India vs Namibia T20 World Cup: రాణించిన తిలక్, సంజు.. కానీ
మధ్యలో తిలక్ వర్మ (25), శివమ్ దూబే (23), సంజు శాంసన్ (22) కీలక పరుగులు జోడించినప్పటికీ, వారు తమ ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభం లభించినా, క్రీజులో సెట్ అయిన తర్వాత వికెట్లు పారేసుకోవడం భారత్‌కు కొంత మైనస్ అయింది.
చివరి ఓవర్లలో వికెట్ల పతనం.. మెరిసిన ఎరాస్మస్
ఒక దశలో భారత్ మరింత భారీ స్కోరు సాధించేలా కనిపించినా, చివరి ఓవర్లలో నమీబియా బౌలర్లు పుంజుకున్నారు. భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: