U19 World Cup 2026: యూత్ వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో ప్రత్యర్థి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి చేతులెత్తేస్తున్నారు.
Read Also: FB Hack: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్
ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి పరాజయం అంచున నిలిచింది. అంతకుముందు 22 ఓవర్లకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. భారత బౌలర్లలో దీపేష్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, ఖిలాన్ పటేల్, కనిష్క్ మరియు ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసి ఇంగ్లాండ్(U19 World Cup 2026) పతనాన్ని శాసించారు. భారత యువ జట్టు ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించడంతో విజయం దిశగా అడుగులు వేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: