U19 World Cup 2026: 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

Read Time:  1 min
U19 World Cup 2026: 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
FONT SIZE
GET APP

U19 World Cup 2026: యూత్ వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో ప్రత్యర్థి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి చేతులెత్తేస్తున్నారు.

Read Also: FB Hack: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి పరాజయం అంచున నిలిచింది. అంతకుముందు 22 ఓవర్లకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. భారత బౌలర్లలో దీపేష్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, ఖిలాన్ పటేల్, కనిష్క్ మరియు ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసి ఇంగ్లాండ్(U19 World Cup 2026) పతనాన్ని శాసించారు. భారత యువ జట్టు ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించడంతో విజయం దిశగా అడుగులు వేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.