ఇంగ్లండ్ లో భాగంగా జరిగిన ఐదు టెస్టుల సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ (Test match) లో టీమిండియా(Team India) ఓటమిని చవిచూసింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నిర్వహించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన శుభమన్ గిల్‌కి ఇది చేదు అనుభవంగా మిగిలింది. తొలి టెస్ట్‌లోనే ఓటమి రావడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. 371 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎంతో అవలీలగా ఛేదించింది. భారత బౌలింగ్ విఫలమైందని స్పష్టమవుతోంది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన
ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుతమైన శతకంతో (149 పరుగులు) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్‌ను అడ్డుకునే లోగడ భారత్‌కు తగిన వ్యూహాలు కనిపించలేదు. మిగతా బ్యాటర్లు కూడా కీలక భాగస్వామ్యాలు నిర్మించడంతో మ్యాచ్‌ను ఇంగ్లండ్ ఖచ్చితంగా తమకు అనుకూలంగా మలచుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చివరి ఏడు వికెట్లను కేవలం 41 పరుగుల తేడాలో కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఆరు వికెట్లు 31 పరుగులకే నేలకూలాయి. రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించే అవకాశం ఉన్నప్పటికీ, లోయర్ ఆర్డర్ పేలవ ప్రదర్శన దెబ్బతీసింది. ఈ తప్పిదమే చివరికి భారత్ ఓటమికి దారితీసి, సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించడానికి కారణమైంది.
భారత బ్యాటింగ్ లో టెయిలెండర్ల భారీ వైఫల్యం
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ముఖ్యంగా టెయిలెండర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ట్టుకు అవసరమైన సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సామాజిక మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
భారత బ్యాటింగ్ లైనప్ డాబర్‌మన్ కుక్కలా ఉందని ఎవరో ట్విట్టర్‌లో పోస్టు చేశారని పేర్కొన్న కార్తీక్.. డాబర్‌మన్ కుక్కు తలభాగం బాగుంటుందని, మధ్యభాగం పర్లేదని, కానీ తోక మాత్రం అస్సలు ఉండదని భారత బ్యాటింగ్ తీరును చమత్కారంగా విశ్లేషించాడు.
రెండో టెస్టులో మార్గదర్శక నిర్ణయాలు కీలకం
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జులై 2న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read also: Rishabh Pant: రిషభ్ పంత్‌పై ICC ఆగ్రహం