📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: India vs Australia: టీ20 సిరీస్‌.. టాస్ గెలిచిన టీమిండియా

Author Icon By Anusha
Updated: November 2, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య మూడో టీ20 పోరాటం ప్రారంభమైంది. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మైదానం (Bellerive Oval Ground) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

Read Also: Mari Selvaraj: గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ డైరెక్టర్

పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. రెండో ఇన్నింగ్స్‌లో కండిషన్స్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. బ్యాట్‌పైకి బంతి ముద్దుగా వస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నాం. తుది జట్టులో మూడు మార్పులు చేశాం.

జితీష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు.’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సన్నద్దతలో భాగంగా తుది జట్టులో భారీ మార్పులు చేసినట్లు అర్థమవుతుంది. మార్పుల కారణంగా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ ఉద్వాసనకు గురయ్యారు. అందరికి అవకాశాలు ఇవ్వాలనే సూత్రాన్ని గంభీర్ పాటిస్తున్నట్లు అర్థమవుతుంది.

 India vs Australia

తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్

మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. ‘ఇది మంచి వికెట్. మంచి ఆరంభం అందుకొని భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మేం ఒకే ఒక్క మార్పు చేశాం. జోష్ హజెల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.’అని మిచ్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినీస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News Hobart T20 India vs Australia T20 latest news Mitchell Marsh Suryakumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.