India vs Australia: భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయానికి గురైన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు రెండో వన్డే అయిన అడిలైడ్ మ్యాచ్‌పై దృష్టి సారించారు. ఈసారి కూడా వర్షం ఆటను చెడగొట్టుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం గురువారం అడిలైడ్‌లో వర్షం అవకాశం కేవలం 20 శాతం మాత్రమే. అంటే అభిమానులు పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశాలు బాగున్నాయని చెప్పవచ్చు. రెండో వన్డే అడిలైడ్ ఓవల్ మైదానంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ (subman gill) నాయకత్వంలోని టీమ్ ఇండియా ప్రస్తుతం సిరీస్‌లో వెనుకబడి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు “డూ ఆర్ డై” సమానంగా మారింది. మొదటి మ్యాచ్‌లో వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన పోరులో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Read also: World Cup: మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ భారత్‌లోనే
India vs Australia: 2వ వన్డేకు వర్షం ఆటంకం ?
రోహిత్ – కోహ్లీపై అభిమానుల ఆశలు
పెర్త్‌లో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఫెయిల్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే అడిలైడ్ మ్యాచ్‌లో వీరిద్దరూ ఘన ఇన్నింగ్స్ ఆడతారనే ఆశలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఈ ఇద్దరూ అగ్రస్థానాల్లో ఉండటం విశేషం. 2019లో ఆస్ట్రేలియాలో చివరిసారి వన్డే సిరీస్ గెలిచిన భారత్, ఈ సారి ఆ ఘనతను పునరావృతం చేయాలనుకుంటోంది. దానికి రోహిత్, కోహ్లీ (kohli) తో పాటు బౌలర్ల ప్రదర్శన కీలకం కానుంది.
ఇండియా vs ఆస్ట్రేలియా రెండో వన్డే ఎక్కడ జరుగుతుంది?
రెండో వన్డే అడిలైడ్ ఓవల్ మైదానంలో జరగనుంది.
అడిలైడ్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయా?
వాతావరణ శాఖ ప్రకారం వర్షం అవకాశం కేవలం 20 శాతం మాత్రమే ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: