Rain threat cricket match : టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వర్షపు మబ్బులు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దాని ప్రభావంతో కొలంబోలో జల్లులు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రముఖ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం మ్యాచ్‌కు ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. మ్యాచ్ సమయంలో మేఘావృత వాతావరణం, సుమారు 27°C ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నాయి. భారత్ అమెరికా, నమీబియాలను ఓడించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్, అమెరికాలపై విజయాలు సాధించింది. సూపర్-8 దశకు అర్హత సాధించే క్రమంలో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 7 మ్యాచ్‌ల్లో గెలిచి ఆధిక్యంలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: