ఐదు ఖండాల్లోని అభిమానులు ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ (India-Pakistan match) పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2025 మ్యాచ్‌ను తాను చూడబోనని స్పష్టం చేశారు. తాజా ఉగ్రదాడుల నేపథ్యంలో ఇలాంటి మ్యాచ్‌లు నిర్వహించడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందన్న విషయం తెలియగానే ఆశ్చర్యపోయా. నేను ఆ మ్యాచ్ చూడను,” అని ఒవైసీ తేల్చి చెప్పారు. గతంలోనే ప్రధాని మోదీ స్వయంగా “నీళ్లు, రక్తం కలిసి పారవు” అని చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు.
ఉగ్రవాద దాడి తర్వాత క్రికెట్ ఎలా?
పహల్గామ్‌లో జరిగిన తాజా ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “ముందుగా వాళ్ల కుటుంబాల దగ్గరే ప్రజలను కాల్చి చంపారు. ఈ దాడి చూసి నేను కలచి పోయా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం అర్థం కాదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్నా కూడా, జాతి భద్రతకు మించి ఏదీ కాదన్నారు. “ఇలాంటి కాలంలో బీసీసీఐ, కేంద్రం ఈ మ్యాచ్‌కు అనుమతి ఇవ్వడం బాధాకరం,” అని ఒవైసీ అన్నారు. ఇది బాధితుల మనోభావాలను గాయపరుస్తుందని చెప్పారు.
హిందూ ఉగ్రవాదం లేదు అన్న షాపై నిలదీత
హోంమంత్రి అమిత్ షా చేసిన “హిందూ ఉగ్రవాదం అనే పదమే లేదు” అన్న వ్యాఖ్యపై కూడా ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు హత్య చేశారు? ఢిల్లీలో సిక్కులపై దాడులు ఎవరు చేశారు?” అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.ఇప్పటివరకూ ఉగ్రవాదం ఒక కొత్త మతంలా తయారైపోయింది. మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి, అని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్యం తర్వాత తొలి ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే అని గుర్తు చేస్తూ, షా గారు ఆ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చని ఎద్దేవా చేశారు.
Read Also : Earthquake : రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం