📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs South Africa: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 (Women’s ODI World Cup 2025) లో టీమిండియా అదిరిపోయే ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టు, ఇప్పుడు నిజమైన పరీక్షకు సిద్ధమవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్థాన్‌లను చిత్తుగా ఓడించి టోర్నీలో దూకుడు చూపిన టీమిండియా, నేడు ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Tilak Varma:హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

ఈ హై వోల్టేజ్‌ పోరుకు విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియం (ACA-VDCA Stadium) వేదికగా నిలుస్తోంది. మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుండటంతో అభిమానుల్లో ఇప్పటికే ఉత్సాహం నెలకుంది.హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత జట్టు ఈసారి టైటిల్‌ గెలుచుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది.

జట్టు బ్యాటింగ్‌ విభాగం శక్తివంతంగా ఉంది. స్మృతి మందన, షఫాలి వర్మ లాంటి ఓపెనర్లు పవర్‌ హిట్టింగ్‌తో మంచి స్టార్ట్స్‌ ఇస్తున్నారు. మధ్యవరుసలో జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సత్తా చాటుతూ అద్భుతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసింది. ఆమె ఫామ్‌ కొనసాగితే దక్షిణాఫ్రికా (South Africa) పై విజయం సులభం కానుంది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి

గత రెండు మ్యాచుల్లో భారత్ గెలిచినా, బ్యాటింగ్ విభాగంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వంటి కీలక క్రీడాకారిణులు ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. అయితే, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి మిగతా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం జట్టుకు ఊరటనిస్తోంది.

IND vs South Africa

బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే స్టార్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం అత్యంత కీలకం.మరోవైపు భారత బౌలింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. పేసర్ క్రాంతి గౌండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి కూడా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

న్యూజిలాండ్‌పై భారీ విజయం

విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరు ఈ మ్యాచులో కీలక పాత్ర పోషించవచ్చు. ఇక, దక్షిణాఫ్రికా జట్టు (South African team) తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌తో ఓడినా, రెండో మ్యాచులో న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 33 వన్డేలు జరగ్గా, భారత్ 20 విజయాలతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

దక్షిణాఫ్రికా 12 సార్లు గెలిచింది. విశేషమేమిటంటే, విశాఖ గడ్డపై భారత మహిళల జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు వన్డేల్లోనూ టీమిండియా (Team India) విజయం సాధించడం గమనార్హం. ఈ రికార్డును కొనసాగించి, టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని జట్టు ఉవ్విళ్లూరుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News ICC Women’s World Cup 2025 India vs South Africa India women cricket team latest news Telugu News Vizag stadium match

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.