📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India vs England : బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్‌.. ఆదుకున్న కరుణ్‌

Author Icon By Divya Vani M
Updated: August 1, 2025 • 9:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 6 వికెట్లకు 204 పరుగులు (India 204 for 6 wickets) చేసింది. ఇంగ్లండ్‌ పేసర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత కీలక బ్యాటర్లను పెవిలియన్‌ చేరేశారు.పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో గస్‌ అట్కిన్సన్‌ 2 వికెట్లు, జోష్‌ టంగ్‌ 2 వికెట్లు, వోక్స్‌ ఒక వికెట్‌ తీశారు.

India vs England : బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్‌.. ఆదుకున్న కరుణ్‌

కరుణ్‌ నాయర్‌ అర్ధశతకం

మొదటి మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్‌ నాయర్‌ నాలుగో టెస్టులో ఆడలేదు. కానీ ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో ఆడి అద్భుతంగా రాణించాడు. సాయి సుదర్శన్‌ (38)తో భాగస్వామ్యం చేసి భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ (19 నాటౌట్‌)తో కలిసి ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.భారత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌. ఐదో టెస్టులో 11 పరుగులు చేసిన గిల్‌ ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతని ఖాతాలో ఇప్పుడు 743 పరుగులు ఉన్నాయి.

గవాస్కర్‌ రికార్డు బద్దలైంది

గతంలో ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉండేది. 1978-79 సిరీస్‌లో గవాస్కర్‌ 732 పరుగులు చేశారు. విరాట్‌ కోహ్లీ 2016-17లో ఇంగ్లండ్‌పై 655 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.కరుణ్‌ నాయర్‌ (Karun Nair) 52 నాటౌట్‌తో నిలిచి భారత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో అతడి భాగస్వామ్యం భారత్‌కు ఊరట కలిగించింది. రెండో రోజు ఆటలో ఈ జంట ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.

Read Also : YS Jagan : జ‌గ‌న్ నెల్లూరు ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసులు న‌మోదు

India vs England Test Karun Nair's half-century Oval Test score Shubman Gill's record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.