📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup: వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించిన ఇండియా

Author Icon By Sudheer
Updated: March 8, 2026 • 11:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి, భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

కివీస్ బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు

భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభం నుంచే తడబడింది. సెమీఫైనల్ హీరో ఫిన్ అలెన్ (9)ను అక్షర్ పటేల్ త్వరగానే పెవిలియన్ పంపగా, రచిన్ రవీంద్ర (1), గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్‌మన్ (3) వరుసగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా టిమ్ సీఫెర్ట్ (52) మెరుపు దాడి చేస్తూ భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, వరుణ్ చక్రవర్తి అతడిని అవుట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ చాపచుట్టేయడంతో భారత్ ఘనవిజయం ఖాయమైంది.

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ముచ్చటగా మూడోసారి!

ఈ విజయంతో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (Back-to-Back) టైటిల్ నెగ్గిన జట్టుగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టైటిల్‌ను నిలబెట్టుకుంది. మొత్తంగా భారత్‌కు ఇది మూడో టీ20 ప్రపంచకప్ (2007, 2024, 2026). ధోనీ, రోహిత్ తర్వాత ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

India creates record T20 World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.