Latest News: Sunil Gavaskar: ఆసీస్ మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. గవాస్కర్ తీవ్ర ఆగ్రహం

Read Time:  1 min
Sunil Gavaskar
Sunil Gavaskar
FONT SIZE
GET APP

ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ ముంగిట ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల (Australian women cricketers) పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అతిథి దేవో భవ” సంప్రదాయం ఉన్న మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని, ఇది దేశానికి మచ్చ వేసిందని ఆయన చెప్పారు.

Read Also: Harshit Rana: రోహిత్ సలహాతో వికెట్ తీసా: హర్షిత్ రాణా

ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌ల కోసం ఇండోర్ (Indore) వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఇద్దరు, తాము బస చేస్తున్న హోటల్ నుంచి ఓ కాఫీ షాప్‌కు వెళ్లారు. ఈ సమయంలో అకీల్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌పై వారిని వెంబడించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ (BCCI) పూర్తి భరోసా ఇచ్చింది.

Sunil Gavaskar
Sunil Gavaskar

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు

‘‘భారత్‌ అంటే అతిథి దేవోభవకు పెట్టింది పేరు. ఈ ఘటన గురించి విన్నాక చాలా బాధగా అనిపించింది. ఇది అత్యంత దారుణ ఘటన. ఇక్కడ చట్టం తన పని తాను చేస్తుంది. దోషికి అత్యంత కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. అలా చేస్తేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నా’’ అని గవాస్కర్‌ (Sunil Gavaskar) వ్యాఖ్యానించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.