📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20

IND W vs SL W:  టీ20 టీమిండియాదే

Author Icon By Aanusha
Updated: December 31, 2025 • 7:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీలంక ఉమెన్స్‌ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ (IND W vs SL W) ను భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది.

Read Also: Rajasthan Royals : కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

176 పరుగుల లక్ష్యం

ఆమెకు తోడుగా అమన్‌జోత్ కౌర్ (21) నిలకడగా ఆడింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ చమరి అటపట్టు (2) త్వరగానే పెవిలియన్ చేరింది. అయితే హసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా దులారి (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించి భారత్‌ను భయపెట్టారు.

IND W vs SL W: The T20 series belongs to Team India

వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించినా.. కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంక ఇన్నింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ రాణా, వైష్ణవి శర్మ, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసి సమిష్టిగా రాణించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

clean sweep India women cricket team latest news Sri Lanka women Telugu News Women T20 Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.