हिन्दी | Epaper
నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు

IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

Aanusha
IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (IND-W vs SL-W) లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరు లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యం సంపాదించింది.అంతకుముందు, టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read Also: IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా

పెద్ద స్కోరు

లంక బ్యాటర్లలో విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో శ్రీలంక పెద్ద స్కోరు చేయలేకపోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.1 22 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

IND-W vs SL-W: Team India registers a resounding victory against Sri Lanka
IND-W vs SL-W: Team India registers a resounding victory against Sri Lanka

అయితే, వారిద్దరూ ఔటైన తర్వాత, జెమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించింది. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో, భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబరు 23న ఇదే స్టేడియంలో జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870