భారత్ – శ్రీలంక (IND W VS SL W) మధ్య జరుగుతున్న 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ మూడో టీ20 మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ (IND W VS SL W)మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఇవాల్టి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
Read Also: Vignesh Puthur: విజయ్ హజారే లో చరిత్ర సృష్టించిన విఘ్నేశ్
అటు శ్రీలంక సైతం సిరీస్ లో తొలి విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. తొలి రెండు మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి టీం ఇండియాకు ఘన విజయాలను అందించారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవిశర్మ పేసర్ క్రాంతి గౌడ్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలవనువ్వడం లేదు.
దీంతో శ్రీలంక జట్టు స్వల్ప స్కోర్ నమోదు చేస్తోంది. 2024 జూలై నుంచి శ్రీలంకపై జరిగిన 11 టీ20ల్లో భారత్ 9 విజయాలను సాధించింది. బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు పదునైన బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌ల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు JioHotstar, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో స్ట్రీమింగ్ కానుంది.
తుది జట్ల వివరాలు అంచనా?
ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అమన్ జోత్, అరుంధతి, క్రాంతి, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), విష్మి, హాసిని, హర్షిత, నీలాక్షిక, కౌశిని, కవీషా, మల్కి, ఇనోక, కావ్య, శషిణి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: