ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 (ICC Women’s World Cup 2025) లో పాకిస్థాన్ మహిళా జట్టు భారత జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఉమెన్ ఇన్ బ్లూ అద్భుతమైన ప్రదర్శనతో 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ ఓటమి అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Pakistan captain Fatima Sana) తన జట్టు చేసిన పొరపాట్లను అంగీకరించింది.
Pakistan : పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ
మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, “మేము బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కొన్ని కీలకమైన తప్పిదాలు చేశాం. ఆ తప్పిదాలే చివరికి మ్యాచ్ చేజారడానికి ప్రధాన కారణమయ్యాయి” అని తెలిపింది.భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోవడంపై ఫాతిమా సనా ప్రధానంగా దృష్టి సారించింది.
“ఆరంభంలో, అంటే పవర్‌ప్లేలో మేం చాలా ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. అలాగే, డెత్ ఓవర్లలో కూడా కొన్ని అదనపు పరుగులు పోగొట్టుకున్నాం. ఈ అదనపు పరుగులే భారత్ స్కోరు పెరగడానికి కారణమయ్యాయి” అని పాకిస్థాన్ కెప్టెన్ పేర్కొంది.
బౌలింగ్ ప్రదర్శన
తన సహచర బౌలర్ డయానా బేగ్ (Diana Baig) బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. “నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ సీమ్ అవుతున్నట్లు అనిపించింది. కానీ డయానా (డయానా బేగ్) సీమ్, స్వింగ్‌ల మధ్య కొంచెం గందరగోళానికి గురైంది.
అందుకే నేను ఆమెకు పదేపదే సూచనలు ఇచ్చాను. తదుపరి మ్యాచ్‌లో ఆమె తప్పకుండా మెరుగవుతుందని అనుకుంటున్నాను” అని ఫాతిమా సనా నమ్మకం వ్యక్తం చేసింది.భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యంపై ఫాతిమా స్పందిస్తూ, “మేము భారత్‌ను 200 పరుగులలోపు కట్టడి చేయగలిగితే, అది మాకు మంచి స్కోర్ అయ్యేది.
ఛేదనలో తమ వ్యూహం గురించి మాట్లాడుతూ
అయితే దాన్ని చేయలేకపోయాం” అని నిరాశ వ్యక్తం చేసింది.ఛేదనలో తమ వ్యూహం గురించి మాట్లాడుతూ, “మా నేటి టాప్-5 బ్యాటింగ్ లైనప్ (Batting line-up) ప్యూర్ బ్యాటర్లతో కూడుకున్నది. కాబట్టి వారు బ్యాటింగ్‌లో తప్పకుండా ముందుకు వచ్చి రాణించాలి. మెరుగైన ఫలితాల కోసం దీర్ఘ భాగస్వామ్యాలు నిర్మించడం చాలా ముఖ్యం.
క్రీజ్‌లో నిలబడి, పరిస్థితులను అంచనా వేస్తూ, దానికి తగ్గట్టుగా ఆడటం నేర్చుకోవాలి” అని తన బ్యాటర్లకు సూచించింది.భారత్‌తో మ్యాచ్‌లో 81 పరుగులు చేసిన సిద్రా అమీన్ (Sidra Amin) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఫాతిమా, “ఆమె మా జట్టులో కీలకమైన ప్లేయర్, చాలా కష్టపడుతుంది. అల్లా సహాయంతో తను రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నాను.” అని తన నమ్మకాన్ని తెలియజేసింది.
పాకిస్థాన్ ను మరోసారి చిత్తుగా ఓడించింది
టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున, జట్టు ఆటగాళ్లు మరింతగా తమను తాము నిరూపించుకోవాలని ఆమె సూచించింది.ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025లో భారత జట్టు దాయాది పాకిస్థాన్ ను మరోసారి చిత్తుగా ఓడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని టీమిండియా, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. పాకిస్థాన్‌కు రెండో ఓటమి కావడం గమనార్హం. వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత్ తరచూ గెలుపొందుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన 12 వన్డేల్లోనూ టీమిండియాదే పైచేయి కావడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: