📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs WI: టీమిండియా భారీ స్కోర్

Author Icon By Aanusha
Updated: October 10, 2025 • 6:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతమైన ఫార్మ్‌లో కనిపించాడని స్పష్టమైంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ అజేయ శతకాన్ని సాధిస్తూ (173 రన్స్ బ్యాటింగ్) అందరిని ప్రభావితం చేశాడు. అతని అద్భుత ప్రదర్శనకు జట్టులోని సహచరులు కూడా ప్రేరణ పొందారు.

Tazmin Brits: చాలా సార్లు ఆత్మహత్యాయత్నం చేశా: స్టార్ క్రికెటర్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం అందించారు. ఆ తర్వాత రాహుల్ (38) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు.

IND vs WI

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సుదర్శన్ (87) తన తొలి టెస్టు శతకానికి చేరువలో వికెట్ చేజార్చుకున్నాడు. జొమెల్ వారికన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోవడంతో

రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.మరోవైపు, ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్, క్రీజులో కుదురుకున్న తర్వాత తన దూకుడు పెంచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

తన టెస్టు కెరీర్‌లో ఐదోసారి 150 పరుగుల మార్కును దాటిన జైస్వాల్, డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.సుదర్శన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20*)తో కలిసి జైస్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Arun Jaitley Stadium India vs West Indies latest news second Test match Telugu News Yashasvi Jaiswal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.