📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs WI: డబ్ల్యూటీసీ లో చరిత్ర సృష్టించిన గిల్

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘనత నమోదైంది. టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అద్భుత బ్యాటింగ్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్‌IND vs WIతో రెండో టెస్టులో సెంచరీ బాదిన గిల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) (WTC) చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విజయంతో అతని పేరు భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది.

Gautam Gambhir: అతడికి సపోర్టు గా నేనున్నా: గంభీర్

ఈ క్రమంలో అతను పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీ (WTC) లో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)10 శతకాలు నమోదు చేశాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది ఐదో సెంచరీ. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘటన సాధించిన భారత టెస్ట్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.

2017, 2018లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా ఐదేసి సెంచరీలు నమోదు చేశాడు.డబ్ల్యూటీసీలో శుభ్‌మన్ గిల్ 10 సెంచరీలతో 2826 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను రిషభ్ పంత్‌ను అధిగమించాడు. పంత్ 6 శతకాలతో 2731 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 9 సెంచరీలతో 2716, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో 2617, రవీంద్ర జడేజా 5 సెంచరీలతో 2505 పరుగులు చేశాడు.

IND vs WI

రెండో భారత బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డు

71 ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ గిల్ 10 శతకాలు నమోదు చేయడం గమనార్హం.కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 శతకాలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డు సాధించాడు. సునీల్ గవాస్కర్ 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధిస్తే.. గిల్ 12 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 26 ఏళ్ల వయసులోనే 19 శతకాలు తన పేరిట లిఖించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు.

నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Shubman Gill Team India Telugu News World Test Championship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.