हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: IND vs South Africa: భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

Aanusha
Latest News: IND vs South Africa: భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

మహిళల ప్రపంచకప్‌ 2025 (Women’s ODI World Cup 2025) లో భాగంగా భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా మహిళల జట్టు (South African women’s team) అద్భుత విజయాన్ని సాధించింది. భారత్‌ నిర్ణయించిన లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్ల తేడాతో ఛేదించి, దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో తమ అత్యంత గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది.

Latest News: IND vs South Africa: విశాఖలో WWC .. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

పేలవ బౌలింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో హర్మన్‌సేన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ చేసిన అసాధారణ పోరాటం వృథా అయ్యింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.

రిచా ఘోష్(77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో) ఒంటరి పోరాటం చేయగా.. స్నేహ్ రాణా(24 బంతుల్లో 6 ఫోర్లతో 33), ప్రతికా రావల్(56 బంతుల్లో 5 ఫోర్లతో 37) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(23), హర్లీన్ డియోల్(13), హర్మన్‌ప్రీత్ కౌర్(9), జెమీమా రోడ్రిగ్స్(0), దీప్తి శర్మ(4) మరోసారి నిరాశపర్చారు. దాంతో భారత్ 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

రిచా ఘోష్, స్నేహ్ రాణాతో కలిసి

కనీసం 200 స్కోర్ అయినా చేస్తుందా? అనిపించింది. కానీ రిచా ఘోష్, స్నేహ్ రాణాతో కలిసి జట్టును ఆదుకుంది. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌లో సెంచరీ ముంగిట రిచా ఘోష్ వెనుదిరిగింది.

సౌతాఫ్రికా బౌలర్ల (South African bowlers) లో క్లో ట్రైయాన్(3/32), మరిజేన్ కాప్(2/45), ఎంలబా(2/46), డిక్లెర్క్(2/52) రాణించారు.అనంతరం సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసి గెలుపొందింది. నదైన్ డిక్లెర్క్(54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84 నాటౌట్), కెప్టెన్ లారా వోల్వార్ట్(111 బంతుల్లో 8 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. క్లో ట్రైయాన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 49) మెరుపులు మెరిపించింది.

 IND vs South Africa
IND vs South Africa

కెప్టెన్ లారా వోల్వార్ట్

లక్ష్యచేధనలో సౌతాఫ్రికా కూడా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దాంతో భారత విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ లారా వోల్వార్ట్ (Captain Laura Wollwart), క్లో ట్రైయాన్, నదైన్ డిక్లెర్క్ సంచలన బ్యాటింగ్‌తో ఓటమిని తప్పించారు.చివరి 24 బంతుల్లో సౌతాఫ్రికా విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్లు కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే ఈజీగా గెలిచేది.

కానీ 47వ ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ వరుసగా 6, 6, 4 ‌తో 18 పరుగులు సమర్పించుకుంది. దాంతో మూమెంటమ్‌ మారిపోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో రెండు బౌండరీల సాయంతో 11 పరుగులు రావడంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారిపోయింది.

అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదిన నదైన్ డిక్లెర్క్ సౌతాఫ్రికా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870