हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక

Anusha
Latest News: IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) టోర్నీ సూపర్-4 దశలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ కండిషన్స్, ఆట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Karun Nair: టీమిండియా నిర్ణయంపై కరుణ్ నాయర్ ఏమన్నాడంటే?

ఈ మ్యాచ్‌లో గెలిచినా మేం ఫైనల్‌కు అర్హత సాధించలేమని తెలుసు. అయినా ఈ మ్యాచ్‌ మాకు కీలకమైనదే. ఇది మంచి పిచ్. భారత్‌ను 170-175 పరుగులకే కట్టడి చేయాలనుకుంటున్నాం. భారత ఓపెనర్లు అద్భుతంగా ఆడుతున్నారు. మా జట్టు ఒక మార్పు చేశాం. చమికా స్థానంలో లియానాగే వచ్చాడు.

తాము బ్యాటింగే చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగే చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘మేం ఇప్పటివరకు ఆడినట్లుగానే మా జోరు కొనసాగించాలి. వాస్తవానికి మేం ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ (Batting) చేయాలని అనుకున్నాం. ఇక్కడి వాతావరణం బాగుంది. ఇదొక మంచి మ్యాచ్. ఈ గేమ్ కోసం ఎదురు చూశాం. క్యాచ్‌లు వదిలేయడం ఆటలో భాగం. మా జట్టు రెండు మార్పులు చేశాం.

IND vs SL

బుమ్రా, శివమ్ దూబే స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులోకి వచ్చారు. ఫైనల్ ముంగిట దూబే, బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకున్నాం.’అని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చెప్పుకొచ్చాడు.టీమిండియా (Team India) కు ఇది నామమాత్రపు మ్యాచ్. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో మూడోసారి తలపడనుంది. మరోవైపు శ్రీలంక (Sri Lanka) విజయంతో ఈ టోర్నీని ముగించాలని భావిస్తోంది. ఫైనల్ ముంగిట ఈ మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో సూర్యసేన ఉంది.

తుది జట్లు

భారత్:అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.శ్రీలంక:పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దసున్ శనక, వానిందు హసరంగా, దుష్మంత చమీరా, మహీశ్ తీక్షణ, నువాన్ తుషార

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870