ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో ఉన్న భారత్ ఇవాళ శ్రీలంకతో టీ20 సిరీస్ (IND vs SL 1st women’s T20) ఆడేందుకు సిద్దమైంది భారత మహిళల జట్టు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. మిగిలిన మూడు మ్యాచ్ లకు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 30 వరకు మ్యాచులు జరగనున్నాయి.
Read Also: Under-19 Asia Cup: టాస్ గెలిచిన భారత్
స్మృతి, హర్మన్, జెమీమా, దీప్తి, కమలిని, వైష్ణవి, రిచా ఘోష్, శ్రీచరణి వంటి ప్లేయర్లతో భారత్ బలంగా ఉంది. అటు చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు కూడా సత్తా చాటాలనుకుంటోంది. 7PMక మ్యాచ్ ఆరంభమవుతుంది. జియో హాట్‌స్టార్ (jio Hotstar) లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
తుది జట్లు ఇవే!
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ రానా, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలివి (వికెట్ కీపర్), శ్రీ చరణి, వైష్ణవి శర్మ.
శ్రీలంక: చమరి అథాపత్తు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నీలక్షిక డి సిల్వా, కవిషా దిల్హరి, ఇమేషా దులాని, కౌషిని నుత్యంగన (వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోకా రణవీర, శశిని కష్మిక మధూషి, నిమేయ కశ్మియాని, సెవ్వండి, మల్కి మాదర.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: