IND vs SA: టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

Read Time:  1 min
Markram reaction
Markram reaction
FONT SIZE
GET APP

IND vs SA: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన మార్క్‌రమ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఎదురైన ఓటమికి ఇది ప్రతీకారం లాంటిదని పేర్కొన్నాడు.

Read Also: Mahieka Sharma Clapping Video: హార్డిక్ పాండ్యా ఔట్ మహీకా శర్మ రియాక్షన్ ఇదే!

సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం గర్వకారణం

భారత్ వంటి పటిష్టమైన జట్టును, అదీ వారి సొంత గడ్డపై లక్షలాది మంది అభిమానుల మధ్య ఇంత భారీ తేడాతో ఓడించడం అసాధారణమని మార్‌క్రమ్ కొనియాడాడు. “భారత్‌ను వారి హోమ్ గ్రౌండ్‌లో ఓడించడం ఎప్పుడూ సవాలే. కానీ మా జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ విజయం మా ప్లేయర్లలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అని వెల్లడించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేయడం తమ ప్రణాళికలో భాగమని చెప్పాడు.

We have taken revenge on Team India: South Africa captain
We have taken revenge on Team India: South Africa captain

సెమీఫైనలే లక్ష్యంగా ముందడుగు

ఈ విజయంతో సూపర్-8లో మంచి స్థితికి చేరుకున్నామని, ఇదే ఉత్సాహాన్ని తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని మార్‌క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. తమ తదుపరి లక్ష్యం సెమీఫైనల్‌కు చేరుకోవడమేనని, ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అది సాధ్యమేనని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా జట్టు సమష్టిగా రాణించడం పట్ల కెప్టెన్‌గా గర్వపడుతున్నట్లు తన సంతోషాన్ని పంచుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.