టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తేరుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌లో (IND Vs SA) బోణీ కొట్టింది.17 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు నమోదు చేసింది. విరాట్ కోహ్లీ (135) శతకంతో మెరిశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రోహిత్ శర్మ (57) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.
Read Also: Virat Kohli: టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలపై బీసీసీఐ క్లారిటీ?
వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతున్నప్పటికీ
ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది. వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతున్నప్పటికీ చివరివరకు పోరాట మనోభావం చూపింది. మాథ్యూ (72), యాన్సన్ (70), బాష్ (67) జట్లు నిలబెట్టే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దాడి చేశారు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: