📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs SA: టీమిండియా ఘోర పరాజయం

Author Icon By Aanusha
Updated: February 22, 2026 • 10:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs SA: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో ఆదివారం జరిగిన కీలక పోరులో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన సౌతాఫ్రికా జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో సెమీ ఫైనల్ ఆశలు బలపరుచుకోవాలనుకున్న టీమ్ ఇండియాకు ఈ ఓటమి భారీ దెబ్బగా మారింది.

Read Also: T20 WC 2026: సూపర్-8 మ్యాచ్..టాస్ గెలిచిన శ్రీలంక

188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) పరుగులేమీ చేయకుండానే మార్క్రామ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.ఆ వెంటనే తిలక్ వర్మ (1) కూడా మార్కో జాన్సెన్ వేసిన మొదటి బంతికే అవుట్ కావడంతో భారత్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

IND vs SA: Team India suffers a crushing defeat

కాసేపు మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 31 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు.111 పరుగులకే  టీమ్‌ఇండియా ఆల్ అవుట్ అయింది. 76 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి చవిచూసింది.శివమ్‌ దూబె (42) భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

INDvsSA SouthAfrica T20WC TeamIndia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.