సౌతాఫ్రికాతో (IND vs SA) రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. డ్యూ పరిస్థితుల్లో ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని తెలిపాడు.
Read Also: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్
సఫారీ బ్యాటర్లు సవాల్ విసిరారు. ముఖ్యంగా, ఓపెనర్ క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి భారత బౌలింగ్ ను చీల్చిచెండాడు. డికాక్‌కు కెప్టెన్ మార్‌క్రమ్ (29) చక్కటి సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో స్కోరును మరింత పెంచారు.
దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ
దీంతో దక్షిణాఫ్రికా (IND vs SA) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో ఒక్క వరుణ్ చక్రవర్తి (4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు) మాత్రమే ఆకట్టుకున్నాడు. ప్రధాన బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (54), జస్‌ప్రీత్ బుమ్రా (45) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం 214 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ (17) కూడా త్వరగానే ఔటయ్యాడు. తాజా సమాచారం అందేసరికి భారత్ 2.2 ఓవర్లలో 19 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనే ఇప్పుడు జట్టు భారం మొత్తం పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: