మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు రోజుల క్రితం రాంచీలో ముగిసిన తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకుని 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. నేడు (బుధవారం) సఫారీలతో రెండో వన్డే (IND vs SA) ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలనే పట్టుదలతో మెన్ ఇన్ బ్లూ ఉంటే.. సిరీస్ ఫలితాన్ని మూడో వన్డేకు వాయిదా వేసేలా సఫారీ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) మరోమారు రసవత్తర పోరు జరుగనుంది.
Read Also: Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న కోహ్లీ
రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. అతడితో పాటు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం ఆడే అవకాశం ఉండటంతో సఫారీల బలం మరింత పెరుగనుంది. బవుమా రాకతో డికాక్, రికెల్టన్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. మిడిలార్డర్‌లో బ్రీట్జ్‌కే, జోర్జి, బ్రెవిస్‌తో పాటు లోయరార్డర్‌లో యాన్సెన్, బాష్‌తో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: